ఈనెల 9న కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి
కన్నూరి దానియల్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐసీసీ టియు భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కన్నూరి దానియల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొనాలి,కార్మికులను బానిసత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000/-లుగాని నిర్ణయించాలి.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదు. ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చెయ్యాలి. అసంఘటితరంగ కార్మికులను యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్’ను ప్రవేశపెట్టాలి.
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపు పెంచాలి. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి.అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్ వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు