1వ వార్డు సమస్యలు పరిష్కరించాలి బీజేపీ నాయకులు
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి పట్టణంలో ఒకటో వార్డులో బిజెపి నాయకులు మార్నింగ్ వాక్ లో అక్కడి ప్రజలను కలువగా అక్కడి ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్లారు.హైదరాబాద్ రోడ్డు నుంచి బచ్పన్ స్కూల్ వెళ్లే దారిలో గంగాధర్ ఇంటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని 15 సంవత్సరాలుగా ఇండ్ల నిర్మాణం అయినప్పటికీ మురికి కాలువల నిర్మాణం కాలేదు తక్షణమే పనులు నిర్మించాలని కోరారు.
ఒకటవ వార్డు బచ్పన్ స్కూల్ ముందు ఉన్న ఇండ్ల మధ్యలోకి వర్షపు నీరు మురికి నీరు నిలుచుచున్నవి అట్టి నీరుని బయటకు పోకుండా పక్క ల్యాండ్ వాళ్లు ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది అందువలన వర్షపు నీరు మురికి నీరు అక్కడికి చేరుకొని చెరువుల వలే తలపిస్తుంది ఇండ్లలోకి వర్షపు నీరు మురికి నీరు పాములు ఇతరతర జీవరాసులు ఇండ్లలోకి రావడం జరుగుతుంది తద్వారా ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.ఒకటో వార్డు లో గల వాసవి రైస్ మిల్ ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు కలవు అట్టి పైపు లు వృధాగా ఉన్నందున తక్షణమే అక్కడ డ్రైనేజీ పనులు ప్రారంభించవలసిందిగా భారతీయ జనతా పార్టీ నాయకులు కల్వకుర్తి మున్సిపల్ ఏఈఈ షబ్బీర్ అహ్మద్ గారికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు గన్నోజు బాబిదేవ్, సీనియర్ నాయకులు గుర్రాల రాంభూపాల్ రెడ్డి,నరెoడ్ల శేఖర్ రెడ్డి, కృష్ణ గౌడ్, గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి నాప శివ కాలనీ వాసులు పాల్గొన్నారు.