బిజెపి ఆధ్వర్యంలో పెన్నులు బుక్కులు పంపిణీ
మందమర్రి నేటి ధాత్రి
అందుగులపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు బ్యాగులు పంపిణీ చేసిన బిజెపి నాయకులు…… మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగుల పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈరోజు బిజెపి రాష్ట్ర యువ నాయకులు దారా రవి సాగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు బ్యాగులు నోటుబుక్కులు పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేష్ .
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే కాకుండా విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి భారతీయ జనతా పార్టీ తరఫున కృషి చేయడం జరుగుతుందని అందులో భాగంగానే బిజెపి నాయకులు రవి సాగర్ రావు పాఠశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి బ్యాగులు, పెన్నులు నోటుబుక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు మునుముందు ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్ మండలాధ్యక్షుడు జనార్ధన్ ఇన్చార్జ్ సంజీవరావు కన్వీనర్ అక్కల రమేష్ పట్టణ అధ్యక్షుడు నరేష్ సంతు రామ్ నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు