మహదేవపూర్
జూలై 3 నేటి ధాత్రి
షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన భూమి కబ్జా పై ఎంపీడీవోకు ఫిర్యాదు
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ
మహాదేవపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ మరియు షెడ్యూల్ కులాల నిర్మాణం కోసం కేటాయించిన భూమిని కబ్జా చేయడం సరికాదని మహనీయులు మనకు హక్కులు కల్పిస్తే వారి పేరున ప్రభుత్వాలు స్థలాలు ఇస్తే మహనీయుల స్థలాలను కబ్జా చేయడం సరికాదని షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని కబ్జా చేయడం చాలా దుర్మార్గమని గతంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు పోయిన ఇప్పటివరకు స్పందించకపోవడం అధికారుల యెుక్క పనితీరు ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన స్థలాలు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యువసేన మండల అధ్యక్షులు మంథని రవితేజ ఎడపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు చేకూర్తి శ్రీనివాస్ సీనియర్ నాయకులు నల్లబుగా ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు