రక్షణ లేని పశువుల ఆసుపత్రి,,,,,,,
శిథిలావస్థలో కూలుతున్న చెట్లు పగులుతున్న గోడలు..
50 సంవత్సరాల పశువుల ఆసుపత్రి,,,,,,
పశువుల ఆరోగ్యం కాదు ఆస్పత్రికి వస్తే అనారోగ్యమే,,,,,
మండల కార్యాలయాలను పట్టించుకున్న నాయకులు కనీసం దయ చూపలేదు,,,,
చికిత్స కేంద్రంపై కూలిన వృక్షం తప్పిన ప్రాణాపాయం,,,,
అధికారులు స్పందించాలని కోరుతున్న రైతులు,,,,
రామయంపేట్ జూలై 3 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట రాజకీయ పట్టణమే కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో కొనసాగుతున్నది 50 సంవత్సరాలు గా నిర్మించిన మండల ప్రజా పరిషత్ పురాతన బ్లాక్ ఆఫీస్ భవనాలను తొలగించి నూతనంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయం నిర్మించిన నాయకులు పై అధికారులు శిథిలవస్తులో ఉన్న మూగజీవాల చికిత్స కేంద్రాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రజలు అంటున్నారు నల్ల పోచమ్మ గుడి వెనుకకు ఆనుకొని ఉన్న రామాయంపేట పశువుల ఆసుపత్రి ఇప్పటివరకు కూడా ఎటువంటి మరమ్మత్తులకు కనీస అవసరాలకు నోచుకోకపోవడం విచారకరం ముందు భాగంలో శిథిలమైపోతున్న రెండు గదులు దానికి ఉన్న మెయిన్ గేటు అలాగే వదిలేసి వెనుక వైపు నుంచి చికిత్స కార్యక్రమాలు చేపడుతుండడంతో
ఈ రెండు గదుల్లో అసాంఘిక కార్యకలాపాలు తాగుబోతులకు ఆలవాలంగా మారిందని స్థానికులు అంటున్నారు పశువులు మధ్యలో తగ్గిపోయిన చాలామంది రైతులు పాడి రైతులు గేదెలను ఆవులను పెంచుకుంటున్నారు అలాగే ఇంటిలో పెంచుకునే కుక్కలు చికిత్స కొరకు పశ్వాసుపత్రి ఎంతైనా అవసరం ఉంది విలువైన మందులు ఇంజక్షన్లు నిల్వ చేసుకోవడానికి ఉన్న ప్రధాన గది నాచు గోడల పగుళ్లు వర్షం పడితే రక్షణ లేదని వైద్యాధి కారులు వాపోతున్నారు ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు మంగళవారం రోజు రాత్రి ఆసుపత్రి ఆవరణలో ఉన్న పెద్ద చెట్టు వానకు విరుచుకు పడడంతో పశువులకు చికిత్స చేసే షెడ్డు పూర్తిగా కూలిపోవడం జరిగింది ఒకవేళ అది చికిత్స సమయంలో పడి ఉంటే డాక్టర్ తో పాటు రైతులు గేదలు కూడా మరణించేవని ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా అధికారులు ఆరోగ్యకరమైన ఆసుపత్రిని అనారోగ్యకరంగా మార్ ఉన్న పరిస్థితులను గుర్తించి దానికి మరమ్మత్తులు కొత్త చెట్టు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు