మహిళలు రాజకీయాల్లోనూ రాణించాలి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: మహరాష్ట్రలోని సేవాగ్రామ్ గాందీ
ఆశ్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ నా యకత్వంలో మహిళలు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహ రించేందుకు నేర్చుకోవాల్సిన అంశాలపై ఐదు రోజుల వర్క్షాపులో రాజకీయ భాగస్వామి కావడానికి మహిళలకు ఉన్న అడ్డంకులు తొల గించుకునేలా బూత్అయిలో వెళ్లి మహిళలు ఒక సముహమును ఏర్పరుచుకొని నాయకులుగా ఎదగాలని రాజకీయాన్ని ప్రబావితం చేసే శక్తిగా మారి మరోవైపు రాజకీయ పార్టీలో మహిళా శక్తిగా అవ తరలించాలని ముఖ్య అతిథులు అన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయ పండితులచే అనేక సెషన్సు నిర్వహించడం జరిగింది. భారతదేశం నుంచి ఈ పరిశ్రమలో నలబైమంది మహిళలు ప్రత్యేక ఆహ్వానం, అనేక ప్రక్రియల ద్వారా ఎంపిక చేయబడిన వారిలో తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి అస్మా, విజయలక్ష్మి పాల్గొన్నారు.