ఏకపక్ష సిద్ధాంతాలు ఎక్కువకాలం మనలేవు

`సర్వజనులకు హితమైనవే ఆమోదయోగ్యం

`బాధితులకు అండగా వుండని సిద్ధాంతాలు వ్యర్థం

`బాధితులకు కులం, మతం, వుండవు. అణచివేత మాత్రమే వుంటుంది

`పిడివాదంతోనే సమాజానికి ప్రమాదం

`ప్రజలకు వాస్తవాలు తెలియాలి

`సైద్ధాంతిక నిబద్ధతను ప్రజలు గుర్తించాలి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక సిద్ధాంతాన్ని నమ్మడం దానికే కట్టుబడి ముందుకు సాగడం వ్యక్తుల నిబద్ధతకు నిదర్శనం. అటువంటి వ్యక్తులు తాము కట్టుబడిన దానికే బద్ధులుగా వుండటం సహజంగా జరుగుతుంది. ఆవిధంగా కట్టుబడలేనివారు వారు నమ్ముకున్న మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. ఆవిధంగా మానవ సమాజం విభిన్న వ్యక్తుల వైవిధ్య అభిప్రాయాల సమారోహంగా కొనసాగుతుండటం అత్యంతసహజం. మానవ నాగరికత ఎప్పటికప్పుడు పరిణామం చెందుతుంటుంది. నూతన ఆవిష్కరణ లు, కొత్త ఆలోచనలు మానవ జీవన ప్రమాణాల్లో తీసుకొస్తున్న మార్పులు ఇందుకు కారణం. ఇది సిద్ధాంతాలకూ వర్తిస్తుంది. సామాజిక మార్పులకు అనుగుణంగా సిద్ధాతాలు కూడా తమ వైఖరిని మార్చుకోకపోతే అవి లుప్తమై పోవడం లేదా పిడివాదంగా మారి, సహజమార్పులను అడ్డు కునే ప్రక్రియలో అవి తీవ్రస్థాయి సాంఘిక సంఘర్షణలకు కారణమవుతాయి. అయితే ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కో సమస్యను లేదా ఒక్కొక్క పరిణామాన్ని తన కోణంలో చూడటం సహజం. ఎవరు ఏ కోణంలో చూసినా ప్రతి సమాజానికి వున్న సాంస్కృతిక వారసత్వం, నేపథ్యం దెబ్బతినకుం డా, సామాజిక ఆలోచనా ధోరణుల్లో వస్తున్న సానుకూల మార్పులను మరింత వేగంగా ముం దుకు తీసుకెళ్లడానికి దోహదం చేసే సిద్ధాంతమే బహుళ ప్రజాదరణ పొందడమే కాదు, చిరకా లం మనగలుగుతుంది. మనదేశంలో కూడా ప్రస్తుతం లిబరల్‌ భావజాలం, జాతీయవాదం అనేవి ప్రస్తుతం విస్తృత ప్ర చారంలో వున్నాయి. ఈ రెండు భావజాలాలు పూర్తిగా భిన్నం కావడంతో ఒక జాతీయ లేదా అంతర్జాతీయ సమస్యను ఇవి చూసే కోణం వేర్వేరుగా వుండటం వల్ల, వీటిల్లో ఏది నిజం? ఏదివర్తమాన కాలానికి అనుగుణం కాదు అని ఒక సాధారణ వ్యక్తి నిర్ణయించుకోవడం కష్టమవు తుంది. ఎందుకంటే ఎవరి కోణంలో వారిది నిజంగా తోచడమే! అయితే ఇక్కడ కావలసింది నిష్పాక్షిక దృక్కోణంతో సర్వజనులకు హితకరంగా వున్న వాదనను లేదా సిద్ధాంతాన్ని ప్రజలు విశ్వసించాల్సి వుంటుంది. ఇక్కడ వారికి సైద్ధాంతిక నిబద్ధత కంటే, సర్వజన హితం ముఖ్యం! ప్రపంచం నలుమూలల విస్తరించి వున్న వివిధ నాగరికతల్లో, ఎవరు ఎక్కువ బాధలకు, పీడనకు గురవుతున్నారనేదానిపై నిష్పాక్షిక విశ్లేషణ అవసరం. అప్పుడు ప్రపంచంలో లేదా మన చుట్టు పక్కలఏం జరుగుతున్నదనేది అందరికీ చక్కగా అర్థమవుతుంది. ఇటువంటి వివరాలను చక్కగా వివ రించగలిగేది మీడియా మాత్రమే! అయితే మీడియా ఇటువంటి వాస్తవిక నిబద్ధతకు బదులు సైద్ధాంతిక కోణానికే పరిమితమైతే అప్పుడు ప్రజల్లోకి వెళ్లేది సమాచారం కాదు, ఒక సైద్ధాంతిక దృక్కోణం మాత్రమే! ప్రస్తుతం మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నదిదే! దీనివల్లఅసలు సమస్య మరుగునపడిపోయి సైద్ధాంతిక సంఘర్షణలకు తావిచ్చినట్లవుతోంది. అందువల్ల సమస్యను వివరించి, దానికి సైద్ధాంతిక కోణాన్ని జతపరిస్తే సామాన్యులకు అప్పుడు విషయ పరిజ్ఞానంతో పాటు ఒక్కొక్క సిద్ధాంతం యొక్క సైద్ధాంతిక కోణాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతా రు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అది జరగడంలేదు. ఇందుకు కొన్ని ఉదాహరణలు పరిశీలించవ చ్చు. 

టిబెట్‌ను అక్రమంగా చైనా ఆక్రమించుకున్న మాట వాస్తవం. ప్రస్తుతం చైనా అక్కడ చేపడుతు న్న అభివృద్ధి పనులను లిబరల్‌ మీడియా ఆకాశానికెత్తేస్తుంది. కానీ అక్కడ జరుగుతున్న సాంస్కృక విధ్వంసమని, తరతరాలుగా అక్కడి ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం పూర్తిగా ధ్వంసమవుతున్నాయని జాతీయవాదం పేర్కొంటుంది. దలైలామా పేరు చెబితే జైలుకు వెళ్లక తప్పదు. ఇక్కడ రెండు వాదనలూ కరెక్టే. కానీ వాస్తవం ఏమిటంటే, టిబెట్‌ అనాదికాలంగా ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడి బౌద్ధ సన్యాసులు వారి గురువైన దలైలామా అహింసను మాత్రమే బోధిస్తారు. దలైలామా కేవలం కర్మ సిద్ధాంతాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతి సాధనను ప్రభోధిస్తారు. అంతేకానివర్గపోరాటాన్ని గురించి చెప్పరు. మరి శాంతి కాముకులపై ఈరకమైన అణచివేత ఎంతవరకు సమంజసమనేది జాతీయవాదం ప్రశ్నిస్తుంది. మరోవిషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. 76ఏళ్ల క్రితం మననుంచి విడిపోయిన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లను, ఒకప్పుడు బ్రిటిష్‌ పాలనలో కొనసాగిన బర్మా (నేటి మయన్మార్‌), భూ టాన్‌లను మన భూభాగాలే అనగలమా? మరి ఎప్పుడో క్వింగ్‌రాజుల కాలంలో కొంతకాలం తమ ఆధీనంలో వున్నదన్న కారణంగా టిబెట్‌ను చైనా ఆక్రమిం చుకోవడం ఎంతవరకు సమర్థనీయం? నిజానికి టిబెట్‌ ఒక స్వతంత్రదేశం! మరో ఉదాహరణ గా ఇజ్రాయిల్‌, పాలస్తీనాలను తీసుకోవచ్చు. ఇజ్రాయిల్‌ ఆక్రమించిన భూభాగాల్లో మౌలిక సదుపాయాల పరంగా చేపట్టే అభివృద్ధి పనులను లిబరల్‌ మీడియా పట్టించుకోదు. పాలస్తీనా విష యంలో లిబరల్‌ మీడియా దురాక్రమణ, జాతివివక్ష, ప్రజల తిరుగుబాటు, ఆత్మగౌరవం, అజ్ఞా తం వంటి సానుభూతి పదజాలాలను ప్రయోగిస్తుంది. చైనా ఆక్రమణలో ఇదే పరిస్థితిని ఎదు ర్కొంటున్న టిబెటన్ల విషయంలో లిబరల్‌ మీడియా ఇటువంటి పదప్రయోగం చేయదు. ఇక్కడ జరుగుతున్న అణచివేతను అన్యాయమని జాతీయవాదం వాదిస్తుంది. టిబెట్‌లో చైనా చేపడుతు న్న మౌలిక సదుపాయాల వృద్ధి లిబరల్స్‌కు కనిపించినప్పుడు, వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ చేపట్టే మౌలిక సదుపాయాలు వీరికి ఎందుకు పట్టవని జాతీయవాదం ప్రశ్నిస్తుంది. అయితే పాలస్తీనా ప్రజలు తమ స్వస్థలాలను వదిలి వెళ్లాల్సి రావడం అమానవీయమని లిబరల్స్‌ వాదిస్తారు. మరిఇదే పరిస్థితి టిబెట్‌లో, కశ్మీర్‌లో, బంగ్లాదేశ్‌లో జరుగుతున్నప్పుడు వీరు ప్రశ్నించకపోవడం ఉ దారవాదం కిందికి రాదు. ఏకపక్షవాదం కిందికే వస్తుంది. కశ్మీర్‌ విషయంలో ప్రజాభిప్రాయం, స్వీయనిర్ణయాధికారం, వాక్‌స్వాతంత్య్ర అని వాదించే ఉదారవాదులు, టిబెట్‌లో అహింసనుపా టించే బౌద్ధుల విషయంలో ఈ పదజాలాన్ని ఎందుకు ప్రయోగించరన్నది జాతీయవాదులు లేవనెత్తే ప్రశ్న. అదేమంటే అది చైనా అంతర్గత సమస్య అని వాదిస్తారు. మరి ఇదే సూత్రం ఇజ్రా యిల్‌కూ వ ర్తిస్తుంది కదా! ఒకవేళ మన జర్నలిస్టులను లాషాకు తీసుకెళితే చైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆకాశానికెత్తేస్తారు. ఇదే ఇజ్రాయిల్‌ వెస్ట్‌బ్యాంక్‌కు తీసుకెళితే, అక్కడ జరిగే అభివృద్ధి వీరికి కనిపించదు. కేవలం పాలస్తీనా ప్రజల కన్నీళ్లు మాత్రమే కనిపిస్తా యి! అంటే ఇక్కడ అణచివేసేది పశ్చిమదేశం లేదా బూర్జువా అయినా తిరుగుబాటు ‘పవిత్రం’ అవుతుంది. అదే అణచివేసేది కమ్యూనిస్టు అయితే అది ‘స్థిరత్వానికి’ ఏర్పడిన ప్రమాదం అవుతుంది. ఇదా లిబరలిజం అంటే? అస్మదీయులకొక నీతి తస్మదీయులకు మరో నీతి పాటించడం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా లిబరలిజం క్రమంగా తన స్థానాన్ని కోల్పోతున్నది. టిబెట్‌లో దలైలామా ను అమెరికా సమర్థించింది. ఇంకేం ఆయన్ను సి.ఐ.ఎ. ఏజెంట్‌గా ప్రచారం చేశారు. ఇదే సమయంలో టిబెట్‌లో తరతరాలుగా వస్తున్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉన్నతిని కావాలనే తమ ప్రచార హోరులో విస్మరించారనేది జాతీయవాదులు ఎత్తి చూపుతున్న అంశం. అంతేకాదు టిబెట్‌ అంటే అదొక ప శ్చిమదేశాలకు అనుకూలంగా ముద్రవేశారు. అందేకాని అక్కడి ఆధ్యాత్మిక ఔన్నత్యం వారికి పట్టదు! ఉదారవాదం అంటే జాతి,కుల, మత వివక్షలేకుండా బాధితులకు అండగా నిలబడి మాట్లాడటం. కేవలం మనదేశంలోనే కాదు యూరప్‌ దేశాల్లో కూడా ఉదారవాదులు ఇదే తరహా ఏకపక్ష వాదనలను వినిపించడం కనిపిస్తుంది. కేవలం ఇటువంటి వైఖరులే, మనదే శంతో సహా అన్ని యూరప్‌ దేశాల్లో జాతీయవాదం క్రమంగా వేళ్లూనుకోవడానికి కారణమవు తోంది. ఈ ఉదార వాదంలో కనిపించే మరో లోపమేంటంటే మెజారిటీ వర్గం అంటే అణచివేతకు పాల్పడతారనేది ఒక ముద్రవేయడం. మరి ఇదే వైఖరి ప్రకారం, బంగ్లాదేశ్‌లోని మైనారిటీలుగా వున్న హిందువులపై మెజారిటీలు జరుపుతున్న అత్యాచారాలు వీరికి పట్టవు. ఇదెక్కడి ఉదారవాదం. ఉదారవాదం అంటే మెజారిటీ మైనారిటీ అని కాదు. కేవలం బాధితుల పక్షానమాత్రమే నిలవడం. టిబెట్‌ విషయానికి వస్తే అక్కడి సంస్కృతి భారతీయ సంస్కృతితో కొన్ని వేల సంవత్సరాలుగా సంబంధాలను పెనవేసుకున్నది. మనకు వారికి మధ్య సరిహద్దు ఒక సమస్యే కాదు. నలంద నుంచితవాంగ్‌ వరకు బౌద్ధ సన్యాసులు స్వేచ్ఛగా పర్యటించారు. ఆధ్యాత్మిక శోభను మరింత పరిమ ళింపజేశారు. ఇప్పటికీ తవాంగ్‌లో మనదేశ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. మొత్తంమీద చెప్పాలంటే కేవలం ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించే వాదం ఎప్పుడైనా తన ఉనికిని కల్పోక తప్పదు. అన్నివర్గాలకు అనుకూలమైన వాదమే ఎప్పటికైనా మనగలుగుతుందన్నది మాత్రం సత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!