జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం
ఎంఈఓ గడ్డం మంజుల
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ 2025-26 విద్యా సంవత్సరం నుండి నూతనంగా తెలంగాణ సార్వత్రిక విద్యా విధానం (ఓపెన్ స్కూల్) ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదువుటకు కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రం నుండి ఓపెన్ స్కూల్ ప్రారంభం అడ్మిషన్లు జరుగుచున్నవి కావున చదువు మధ్యలో ఆపేసి లేదా రెగ్యులర్ గా పాఠశాలలకు వెళ్లలేని వారికోసం తెలంగాణ సార్వత్రిక విద్యా విధానం ద్వారా చదువుకునే అవకాశాన్ని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ కల్పిస్తున్నాయి కావున మండలంలోని వివిధ గ్రామాలలో ఓపెన్ స్కూల్/ఇంటర్మీడియట్ విద్య లో ఉత్తీర్ణత పొందుటకు ఉన్నత చదువులకు పదోన్నతులు ఉద్యోగాలలో ప్రభుత్వ గుర్తింపు ఉంటుందని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది.
ఓపెన్ స్కూల్/ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పొందుటకు ఈ క్రింది సర్టిఫికెట్ తో పదవ తరగతి చదువుకునేవారు టిసి బర్త్ సర్టిఫికెట్ కుల ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డు పాస్ ఫోటో మరియు ఇంటర్మీడియట్ చదువుకునే వారు పదవ తరగతి మార్కుల పట్టిక కుల ధ్రువీకరణ పత్రం ఆధార్ సర్టిఫికెట్ పాస్ ఫోటో లతో కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో ఆర్డినేటర్ జి మంజుల ఫోన్ నెంబర్ 94911 04082 సంప్రదించగలరు.