
Peddi Anjaneyulu
మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి
మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి
ప్రస్తుతం వర్షాలు పడి మొక్కలు నాటడానికి అనువైన సమయమైనందున మండల పరిధిలోని అన్ని గ్రామాలలోని నర్సరీలలో పెంచిన మొక్కలు ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేసి ప్రతి మొక్క ఏనుకునేలా చూడాలని యంపీడీఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.మండలంలోని లక్ష్మీపూర్ గ్రామం అంగన్వాడీ సెంటర్లో నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమం లో బాగంగా చిన్నారి చే మొక్క నాటించి పర్యావరణ పరిరక్షణ చేయాలని ఆదేశించారు.అనంతరం గ్రామంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించి రెండు రోజుల లో మొక్కల పంపిణీ చేసి వెబ్ సైట్ లో నమోదు చేయాలని అలాగే మిగతా ప్లాంటేషన్ కూడా పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో
పంచాయతీ కార్యదర్శి రిజ్వానా అంగన్వాడీ టీచర్ స్రవంతి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సారంగపాణి ఉపాధ్యాయులు బాసాని లత గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.