తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ హోతి(కె)లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ తాళాలు లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని, అధికారులు 20 రోజుల్లో ఇస్తామన్న హామీ నిలబెట్టుకోక పోవడంతో నిరసిస్తూ మంగళవారం రోజు సిపిఎం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తాసిల్దార్ కార్యాలయం ముట్టడించి బైటాయించిన సందర్భంగా అధికారులతో వాగ్వాదం జరిగింది, స్పష్టమైన తేదీ ప్రకటించే వరకు కదిలేది లేదని కూర్చోవడం జరిగింది. తాహసిల్దార్ డిప్యూటీ తహసిల్దార్ తో సిపిఎం నాయకులతో ఫోన్లో మాట్లాడి 7వ తేదీలోగా ఇళ్ల తాళాలు అప్పచెబుతామని, అప్పటివరకు వేచి ఉండాలని ఆలోపు కచ్చితంగా ఇస్తామన్నా స్పష్టమైన హామీతో ఆందోళన విరమించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు ఎస్.మాట్లాడుతూ పేదలకు వచ్చిన ఇళ్లను ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని, తక్షణమే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక పేదలు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే ఇంటి తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి కూడా అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం ఏడవ తేదీ లోపు ఇళ్ళ తాళాలు ఇవ్వకుంటే లబ్ధిదారులే వెళ్లి ఇళ్లల్లో ఉంటారని, నివసిస్తారని అన్నారు. ఆ పరిస్థితి వరకు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిరుపతి, సలీం, బక్కన్న, డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు శ్రీనివాస్, శివకుమార్, యాదుల్, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.