డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఏడాదిన్నర క్రితం ఇళ్లు కేటాయిస్తూ మంజూరుపత్రాలు జారీచేసినా ఇళ్లను అప్పగించడంలేదని స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాన్ని సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఆందోళనపై స్పందించిన అధికారులు ఈనెల 7వ తేదీలోపు ఇళ్లతాళాలు లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లబ్దిదారులకు తాళాలు ఇవ్వనిపక్షంలో ఆందోళన చేపడతామని సీపీఎం నాయకుడు మహిపాల్ హెచ్చరించారు.