వైద్యులు ప్రత్యక్ష దేవుళ్ళు
కాశీబుగ్గ, నేటిధాత్రి
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కాశీబుగ్గ చెందిన జై సీతారాం పరపతి సంఘం ఆధ్వర్యంలో వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి మధుకు మరియు చర్మ వైద్య నిపుణులు కూరపాటి స్వాతి దంత వైద్య నిపుణులు కూరపాటి మౌక్తిక కి వైద్యుల దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించినారు ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యోగా సేవా సంస్థ అధ్యక్షులు కూరపాటి సుదర్శన్, జై సీతారాం పరపతి సంఘం అధ్యక్షులు వంగరి రవి, భద్రకాళి దేవస్థానం మాజీ ధర్మకర్త సాంబారి మల్లేశం, ఆరే రమేష్, చిలుపూర్ మల్లేశం, లకుoభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.