
Sleeping.
7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా ఈ వ్యాధులు తప్పవు…
చాలా మంది 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతుంటారు. అయితే, ఇలాంటి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..
గుండె జబ్బుల ప్రమాదం:
నిద్ర లేమి వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. నిద్ర లేమి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను పెంచుతుంది. ఇది ధమనులలో వాపుకు కారణమవుతుంది. కాబట్టి, ప్రతిరోజూ 7 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
డయాబెటిస్ ప్రమాదం
తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. నిద్రలేమి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. అంటే మీ కణాలు ఇన్సులిన్‌కు తక్కువ ప్రతిస్పందిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోండి.
నిద్ర లేమి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిరాకు, ఒత్తిడి పెరగడం, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే, భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి, ఎన్ని పనులున్నా 7-8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.
బలహీనమైన రోగనిరోధక శక్తి, ఊబకాయం
నిద్రలేమి కారణంగా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. ఇది ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే, నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది, ఇది బరువు పెరగడానికి, ఊబకాయానికి కారణమవుతుంది. కాబట్టి, రోజు 7-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.