Sub-Inspector Rabbani & Staff, Jangedu High School.
మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దాం ఎక్సైజ్ ఎస్సై రబ్బాని
భూపాలపల్లి నేటిధాత్రి
మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దామని భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బాని అన్నారు.పట్టణ భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బాని హాజరై పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని,గంజాయి, డ్రగ్స్ తదితర మాదకద్రవ్యలను వినియోగించిన,సరఫరా చేసిన, నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మాదకద్రవ్యలను వినియోగించడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి అన్నారు.మాదకద్రవ్యలను సరఫరా చేసిన నేరంగా పరిగణించి కేసు చేపడుతమని విద్యార్థులకు చెప్పారు. మాదకద్రవ్యలకు దూరంగా ఉండాలని,విద్యార్థులు చదువు పై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఎవరైనా మాదకద్రవ్యాలు వాడుతున్నాట్టు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు, మీ గురువులకు చెప్పి మాదకద్రవ్యాల నిరోధానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బానీ & సిబ్బంది,
జంగేడు ఉన్నత పాఠశాల హెచ్ఎం అశోక్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
