రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలి…
మంగపేట నేటిధాత్రి:

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాహనదారులందరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు మన ప్రాణానికి ముప్పుగా మారుతున్నాయి ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం కావున ప్రజల విధిగా హెల్మెట్ ధరించి వాహన చట్టాలను గౌరవిస్తూ ప్రయాణం సాగించాలని మంగపేట పోలీస్ విజ్ఞప్తి చేశారు.
మంగపేట పోలీస్ పరిధిలో జరిగిన లోకధారథలో 70 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులో పైన్ మరియు పదిమందికి మూడు రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది అని కావున అందరూ హెల్మెట్ ధరించకుండా , ఆల్కహాల్ తాగి వాహనాలు నడపరాదని వాహన దారులకు పోలీసులు వారు విజ్ఞప్తి చేశారు.