
MLA GSR.
రెడ్డి కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి
మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డికాలనీ పేస్ – 1 లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులు రెడ్డికాలనీ వాసులను ఆదర్శంగా తీసుకుని అన్ని వార్డుల్లో దొంగతనాలు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి పిసిసి మెంబర్ చల్లూరి మధు అప్పం కిషన్ దాట్ల శ్రీనివాసు ముంజల రవీందర్ కేతరాజు సాంబమూర్తి కురుమిళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు