
Peddaiah Palli in Balanagar
వాగులో పడి మహిళ మృతి
బాలానగర్ /నేటి ధాత్రి.
దుందుభి వాగులో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దయ్య పల్లి శివారులో శనివారం జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. గుండేడ్ గ్రామానికి చెందిన శంకరమ్మ (47) గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతున్నది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వెతికిన ఆచూకీ లభించలేదు. శనివారం బాలానగర్ మండలంలోని పెద్దాయ పల్లి గ్రామ శివారులో ఉన్న దుందుభి వాగులో శంకరమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకరమ్మ మృతిపై ఎవరిపై అనుమానం లేదని.. కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.