
Formation Day
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
నేటి ధాత్రి గార్ల:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,నీళ్లు, నిధులు,నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని అన్నారు.అమరుల ఆకాంక్షలు, ఆశయాల కోసం సకల జనులందరూ కృషి చేయాలని ఆయన కోరారు.స్వరాష్ట్రము కోసం అసువులు బాసిన తెలంగాణ అమరవీరులందరికీ నివాళులు అర్పించారు. పోలీస్ స్టేషన్ లో ఎస్సై రియాజ్ పాషా, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద విశ్వ జంపాల,తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శారదా, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగావత్ లక్ష్మణ్ నాయక్,సొసైటీ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ నాయుడు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్,కడియం వెంకన్న, సొసైటీ సీఈవో వెంకటేశ్వర్లు, గిన్నారపు మురళి తారక రామారావు, భూక్యా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.