
MLA and BRS party
దశదినకర్మల్లో పాల్గొన్న రేగ
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.నేటిధాత్రి…
కరకగూడెం మండలంలోని వెంకటపురం గ్రామానికి చెందిన పోలెబోయిన క్రిష్ణయ్య (హెల్త్ డిపార్ట్మెంట్-కరకగూడెం)తండ్రి గారైన పోలెబోయిన.ఎర్రసమ్మయ్య అనారోగ్యంతో మరణించారు.శనివారం దశదినకర్మలకు పినపాక మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు బాధిత ఇంటికి వెళ్లి,మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య, గ్రామ మాజీ సర్పంచ్ పోలెబోయిన పాపమ్మ,స్థానిక నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.