
Collector Rahul Sharma
భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
సరస్వతి పుష్కరాలకు రానున్న రెండు రోజుల్లో లక్షలల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
సరస్వతి పుష్కరాల కొనసాగుతున్న నేపథ్యంలో 10 వ రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఏర్పాట్లను పరిశీలించి వాకి టాకీ ద్వారా రానున్న రెండు రోజులు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సరస్వతి ఘాట్ లో భక్తల రద్దీని పరిశీలించి కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలు, రక్షణ చర్యలు, విఐపిలు పుణ్య స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని, కంటైనర్ ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మెయిన్ ఘాట్ నుండి సరస్వతి ఘాట్ వరకు ఏర్పాటు చేసిన మట్టి రోడ్డులో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విఐపిల కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ లో క్రమం తప్పక నీటి సరఫరా ఉండే విధంగా చూడాలని సూచించారు. ఘాట్ ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని భక్తుల రద్దీని పరిశీలించి పుష్కరాల సేవలు ఏవిధంగా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని త్వర త్వరగా దర్శనాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడి నుండి కాళేశ్వరం లోని పలుగుల జంక్షన్, తాత్కాలిక బస్టాండ్, ఇప్పల బోరు జంక్షన్, పార్కింగ్ స్థలాలను పరిశీలించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులతో మాట్లాడారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా పోలీసులు అప్రత్తంగా ఉండాలని ఎలాంటి ప్రమాదాలు జరగ కుండా సురక్షిత ప్రయాణాలు చర్యలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.