
Revenue Minister Ponguleti Srinivas Reddy
రెవెన్యూ శాఖ మంత్రికి ఘన స్వాగతం పలికిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
పేద ప్రజలకు అండగా నిలిచేది భూ భారతి చట్టం.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జైపూర్,నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆలోచించి భూ భారతి చట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో వారు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ…
గత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ధరణి లో ఉన్న లోపాలను, మిగిలి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా భూభారతి ఆర్ఓఆర్ 2025వ చట్టం తీసుకురావడం జరిగిందని అన్నారు.
Revenue Minister Ponguleti Srinivas Reddy
సుమారుగా లక్ష మందితో చర్చలు జరిపి పేద రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ధరణిలో పరిష్కారం కానీ మిస్సింగ్ సర్వేనెంబర్ రైతుల వివరాలలో తప్పులు,డిఎస్ పెండింగ్,అసైన్డ్ పట్టా,నిషేధిత జాబితా మార్పు,వారసత్వం, భూసేకరణ సమస్యలు, అటవీశాఖ రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పందంగా మారిన భూముల మార్పుల వివరాలు,తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆర్ఓఆర్ చట్టం వెలుగులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు.
భీమారం మండలంలో 2000 మంది రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని అందులో చాలావరకు సాదాబైనామాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని వాటిని కూడా అతి త్వరలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్,ప్రభుత్వ సలహాదారు హార్కరా వేణుగోపాల్,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.