
Inspector
కొనుగోలు
వేగవంతం చేయాలి
• రెవెన్యూ ఇన్స్పెక్టర్
ప్రీతి
నిజాంపేట నేటి ధాత్రి:
అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు వేగవంతం చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్, నంద గోకుల్, చల్మెడ గ్రామాల్లో సొసైటీ, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించడం జరిగిందన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలన్నారు. టార్పోలిన్లు అందుబాటులో ఉంచుకొని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు బురాని మంగ, బురాని వాణి, రైతులు అదే స్వామి, ఊడేపు రాజయ్య, కూడవెల్లి చంద్రం తదితరులు ఉన్నారు.