
Kotagullu Goshala.
కోటగుళ్ళు గోశాల గోమాతలకు దానా బస్తాల వితరణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు గోశాల గోమాతలకు గణపురం మండల కేంద్రానికి చెందిన పెద్దపల్లి విరాట్ చారి రమాదేవి ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు గోశాల గోమాతలకు దానా బస్తాలు అందజేసిన దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.