
students
పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ముదిగుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 19 మంది లో బాలురు(13) బాలికలు(6 )గురు విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో చదివిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అధిక మార్కులు సాధించి ఉత్తీర్ణత అయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని పేద మధ్య తరగతి విద్యార్థులు అధిక మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరును తీసుకొచ్చారని అన్నారు.అలాగే గ్రామస్తుల సహాయ సహకారాలు,పాఠశాల విద్య కమిటీ చైర్మన్ గుండా సునీత,ఉపాధ్యాయులు చూపిన చొరవతో అధిక మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.