జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన సంఘటనను నిరసిస్తూ
స్వచ్ఛందంగా మంచిర్యాల పట్టణ బందుకు అన్ని సంఘాల ఆమోదం
మంచిర్యాల,నేటి ధాత్రి:
జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై పాకిస్తాన్ టెర్రరిస్టు లు దాడులను నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలో మే 3 న బంద్,ర్యాలీని విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు,హిందూ సంఘాలు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని సంఘాలు సంఘీభావంతో బంద్ లో పాల్గొని విజయవంతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ పర్వతాల నరసయ్య,సహా కార్యవర్గం, హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డేగ రవీందర్, కార్యదర్శి కర్ణ గంటిరవీందర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, తపస్సు టిపిఎస్,భవన నిర్మాణ సంఘం,హమాలి సంఘం, పెయింటర్స్ అసోసియేషన్,ఎలక్ట్రిషన్ అసోసియేషన్, బీసీ సమాజ్ సంఘం,బీఆర్ఎస్,బిజెపి వివిధ సంఘాలు సంఘీభావం తెలుపుతూ బందులో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.