అభివృద్ధి అనేది కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమవుతుంది.

Chairman

అభివృద్ధి అనేది కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమవుతుంది

కేసముద్రం మండల షాదీ ఖానా కమిటీ కి సన్మానం

వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి

 

కేసముద్రం/ నేటి దాత్రి:

 

మంగళవారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయము లో ముస్లిం మండల షాదీ ఖానా కమిటీ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది, నూతనంగా ఏర్పడ్డ షాది ఖానా మండల నూతన కమిటీ సభ్యులు మరియు ముస్లిం సోదరులు పెద్దలు కలిసికట్టుగా మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, డైరెక్టర్లు సంకేపల్లి నారాయణరెడ్డి, చిదురాల వసంతరావు, ఆ యూబ్ ఖాన్, ఆర్టిఏ మెంబర్ రావుల మురళి, నూతన షాది ఖానా మండల కమిటీ అధ్యక్షులు మహమ్మద్ రజాక్, ఎండి రఫీ, తాజుద్దీన్, లను మరియు కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి షాది ఖానా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ కేసముద్రం మండల ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని షాదీ ఖానా ఏర్పాటు కొరకు 80 లక్షల రూపాయలు మంజూరు చేయుటకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే షాదీ ఖానా అభివృద్ధి కొరకు ఇంతటితో సరిపోదని ఇంకా మునుముందు సహాయ సహకారాలు ఉంటాయని 80 లక్షల రూపాయల నిధితో షాది ఖానా ఏర్పాటు చేయడం నిధి సరిపోకపోతే మరల కొంత నిధులు మంజూరు చేయించడం కోసం కృషి చేస్తామని అన్నారు. అలాగే కేసముద్రం మండలంలోని ముస్లిం సోదరులు అందరూ ఏకతాటిపై ఉండి షాదీ ఖానా అభివృద్ధి కొరకు పాటుపడాలని, ముస్లిం సోదరులు అందరూ సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని హితువు పలికారు. ముస్లింలలో చాలావరకు నిరుపేద కుటుంబాలే ఉన్నాయని అలాంటి నిరుపేద కుటుంబాలు శుభకార్యాలు చేసేవారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ షాదీ ఖానా ఏర్పాటు అనంతరం అందరికీ అందుబాటులో వస్తుందని ఎవ్వరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని ఈ షాదీ ఖానా అందరికీ ఉపయోగపడుతుందని ఈ అవకాశాన్ని అందరూ కలిసికట్టుగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూరెల్లి సతీష్. ముదిగిరి సాంబయ్య. షాదీఖానా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!