లీగల్ అవేర్నెస్ క్యాంపు…
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో లీగల్ అవేర్నెస్ క్యాంపును ప్యానెల్ అడ్వకేట్ సోమశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో కనీస వేతన చట్టం, పనిప్రదేశాల్లో భద్రత, మహిళల లైంగిక వేదింపుల నిరోధక చట్టంపై వివరించారు. ఉచిత న్యాయ సేవా సహాయంపై అవగాహన కల్పించారు.