
Temple
దేవాలయ భూములను కాపాడాలని వినతి.
కల్వకుర్తి/నేటి దాత్రి
కల్వకుర్తి మండలం రఘుపతి పేట రామగిరి దేవాలయ భూములను కాపాడాలని దేవాదయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీమతి కృష్ణవేణి గ్రామస్తులు, బిజెపి నాయకులు వినతి పత్రం సమర్పించడం జరిగింది.
దేవాలయ భూములకు 540 ఎకరాలు సంబంధించిన భూములలోని 100 ఎకరాలకు పైగా ఉన్నగుట్టను కొంతమంది కాంట్రాక్టర్ ఇష్ట రీతిన మట్టిని అక్రమంగా తరలించడం జరుగుతుందని, దేవాలయ భూములను కాపాడాలని, మట్టిని అక్రమంగా తవ్విన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్,మండల అధ్యక్షులు నరేష్ గౌడ్,మాజీ టౌన్ ప్రెసిడెంట్ బోడ నరసింహ ,వైస్ చైర్మన్ శ్యామ్ సుందర్,రఘుపతి పేట గ్రామస్తులు మల్లికార్జున్ రెడ్డి, వినయ రెడ్డి,రమేష్,సైదులు తదితరులు పాల్గొన్నారు