
Farmers suffer
వర్షాల కారణంగా రైతులకు పంట నష్టం ….
◆ చేతికొచ్చిన పంట కోతకు రాని దుస్థితి
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం పరిధిలోని మామిడి మొక్కజొన్న, బొప్పాయి పంట రైతులకు తీవ్ర నష్టం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు.చేతికొచ్చిన పంటలను కోయలేని పరిస్థితి నెలకొనడంతో రైతు నేలకు భారీ నష్టం సంభవిస్తుంది.మొక్కజొన్న,కూరగాయల వంటి పంటలు కోతకు సిద్ధంగా ఉండగా, నిరంతర వర్షాలు, వడగళ్ల కారణంగా బురదమయ ఏమైనా పొలాల కారణంగా కోత పనులు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు పొలాల్లో నిలిచిపోవడంతో పంటలు కుళ్లిపోతున్నాయి. ముఖ్యం గల తక్కువ ఎత్తులో ఉన్న పొలాల్లో నీరు చేరడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ పరిస్థితి రైతులను ఆర్థికంగా మానసీకం గా కూడా కుంగదీస్తుంది. కొందరు రైతులు పంట కోసేందుకు కూలీలు రాకపోవంతో యంత్రాలు బురదలో కదలలేని స్థితి కారణంగా నష్టం తప్పడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి, బొప్పాయి. రైతులు భారీ వర్షాలు వనగళ్లు కారణంగా కాయలు తీ వ్రంగా దెబ్బతినడంతో మార్కెట్లో ధర లేకపోవడం తో చెట్టుపైనే మామిడికాయలు కోయకుండా వదిలేశారు. రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని సూచించారు. రైతుల కష్టాలను తీర్చడానికి వ్యవసాయ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని పంట నష్టాన్ని అధిగమించేందుకు సాంకేతిక,ఆర్థిక సహయం అందించాలని స్థానిక రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.