రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్ట్ లకు ప్రత్యేకంగా రుణాలు కేటాయించాలి
తీగల శ్రీనివాస్ రావు
జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్(ఏ డి జె ఎఫ్)
మంచిర్యాల నేతి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎలాంటి జీత భత్యాలు లేకుండా నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిస్వార్థంగా సేవ చేస్తున్న జర్నలిస్ట్ లకు ప్రత్యేకంగా రుణాలను కేటాయించాలని అల్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే గొప్ప ఉద్దేశం తో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ఉన్నత చదువులు చదివి జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్న వారికి ప్రత్యేక అవకాశం కల్పించినట్టైతే వారిని ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహించినట్టు అవుతుందని అన్నారు.ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్ట్ జీవితాలు మారలేదన్నారు. ఈ ప్రజా ప్రభుత్వం లో రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్టుల కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.