జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము…_
— మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్
కాప్రా నేటిధాత్రి 24
జమ్మూ కాశ్మిర్ లోని అనంత నాగ్ జిల్లా పెహల్గామ్ లో నిన్న జరిగిన ఉగ్ర దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్ అన్నారు.
జమ్మూ కాశ్మీర్ అందమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం, ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వo పూర్తి బాధ్యత వహించాలని దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాము..
గాయపడిన కుటుంబాలకు మెరుగైన చికిత్స అందించి వారి కుటుంబాలకు ధైర్యాన్ని చేకూర్చాలి అదేవిధంగా ఉగ్రదాడి బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకొని వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉన్నది దాడికి బాధ్యులైన వారిని వెంటనే పట్టుకొని ఉరిశిక్ష అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సమయంలొ దేశప్రజలు అందరు ఒక్కటై బాధితకుటుంబలకు అండగా నిలబడాలని కోరుతున్నాము.