జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ.
జహీరాబాద్. నేటి ధాత్రి:
కాశ్మీర్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. బుధవారం రాత్రి యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని ఐపీ గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. దాడులలో మృతి చెందిన వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.