పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
బొచ్చు కోమల
యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్
పరకాల నేటిధాత్రి
పెహాల్గంలో ఉగ్రవాదుల చేతిలో చంపబడిన 26 మంది అమాయక పర్యాటకులపై దాడిని వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల తీవ్రంగాఖండించారు.ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ఆయన అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ మృతి చెందిన వారికి తన సంతాపాన్ని తెలియజేస్తూ దాడిలో గాయపడిన 20 మంది త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్తిస్తున్నట్లు తెలిపారు.బాధిత కుటుంబాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని,ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను గుర్తించి,వారిని పెంచి ప్రోత్సహిస్తున్న ఉగ్ర వాద సంస్థలను సమూలంగా దేశంలో లేకుండా తుడిచివేయాలని,ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని దేనని,ఉగ్రదాడుల్లో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.