జిల్లా పరిషత్ పాఠశాలలో
తల్లిదండ్రులు ఉపాద్యాయుల సమావేశానికి హాజరైన ఎస్సై దీకొండ రమేష్
ఓదెల (పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:
ఓదెల మండలం కనగర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగిన తల్లి దండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా పోత్కపల్లి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ధీకొండ రమేష్ హాజరయ్యారు.2024-25 విద్యాసంవత్సరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు జారీ చేసిన ఓదెల యం ఈ ఓ Y. రమేష్ ఈ సందర్భంగా SI రమేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు జాగ్రత్త గా ఉండాలని ఈత కోసం వెళ్లి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది అని, మొబైల్ ఫోన్లను వాడే క్రమం లో ఆన్లైన్లో జరిగే మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని. విద్యార్థినులు ఫేస్ బుక్,వాట్సాప్,ఇన్స్తా గ్రామ్ లలో జరిగే మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ ఆన్లైన్ గేమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని,చిన్న పిల్లలకు బైక్ లు మొదలైన వి డ్రైవింగ్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని అన్నారు.ఓదెల MEO మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు చదవడం రాయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పై తరగతులకు చెందిన తెలుగు,హిందీ పుస్తకాలు విద్యార్థులకు అందించి వాటిని తిరిగి పాఠశాల ప్రారంభం నాటికి వాటిని చదవడం రాయడం చేస్తూ భాష పట్ల ప్రావీణ్యం పెంచుకోవాలని, ప్రమాదాల వైపు పోకుండా తల్లి దండ్రుల సంరక్షణలో ఉండాలని కోరారు.2024-25 విద్యాసంవత్సరం FLN లో ఓదెల మండలం యం ఈ ఓ సమర్ధ వంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో ఓదెల 3వ స్థానం లో నిలిపినందుకు డి ఈ ఓ చేతుల మీదుగా ప్రశంస అందుకున్న యం ఈ ఓ కు గ్రామస్తులు విద్యార్థుల తల్లి దండ్రులు శాలువాతో సన్మానం చేశారు.ఈ సమావేశం లో కనగర్తి మాజీ సర్పంచ్ తాళ్లపల్లో లక్ష్మణ్ , కొట్టిరెడ్డి మహేందర్ రెడ్డి ,మాజీ వార్డు సభ్యులు తాళ్లపెల్లి శ్రీనివాస్ ,జాగిరి కిషోర్ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిండ్రులు పాల్గొన్నారు.