నిన్న బి.ఆర్.ఎస్. లోకి నేడు సొంత గూటికి.!

BRS

నిన్న బి.ఆర్.ఎస్. లోకి నేడు సొంత గూటికి???
స్థానిక ఎలక్షన్స్ రాకముందే వేడెక్కుతున్న రాజకీయాలు
కక్కిరాల పల్లిలో మళ్ళీ మారిన రాజకీయం
మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో తిరిగి చేరికలు
కక్కిరాలపల్లి గ్రామంలో రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక..

నేటిధాత్రి ఐనవోలు :

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఐనవోలు మండలంలోని బీఆర్ఎస్ బిజెపి నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయము అందరికి తెలిసిందే.మంగళవారం రోజు అధికార పార్టీ నుంచి కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు గతంలో పార్టీలో పనిచేసిన కార్యకర్తలుకక్కిరాలపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కండవు కప్పుకున్న నాయకులు కార్యకర్తలు తిరిగి మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేష్ ఆధ్వర్యంలో బుధవారం అధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు ప్రలోభాలకు గురి కావద్దని అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీలో చేరిన వారికి తగు ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందని ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతాయని. కె ఆర్ నాగరాజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరికీ సమన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ బిజెపి నాయకులు చెప్పిన మాటలు విని ఆగమాగం కావద్దని అధికార పార్టీతోనే అన్ని సాధ్యమైతాయని ప్రతి కార్యకర్తను ఎమ్మెల్యే కంటికి రెప్పలా కాపాడుకుంటాడని పార్టీలో చేరిన వారికి ఈ సందర్భంగా మహేష్ గౌడ్ తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వారిలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు పొన్నం గోపాల్. బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కంజర్ల సురేష్ మాజీవార్డు మెంబర్ కంజర్ల అశోక్ బీఆర్ఎస్ నాయకులు కంజర్ల మధుకర్ కత్తెర శాల రమేష్ అరుణ, బర్ల సుమలత రాజు, అరూరి లలిత, అరూరి పూలమ్మ, రావుల సాంబయ్య, కంజర్ల మమత, కంజర్ల యాకమ్మ, అన్నెపు రాజు,నూనె రాజ్ కుమార్, పిట్టల యాదమ్మ, నాయిని శ్రీను మరియు నూనె రాజు తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!