ప్రపంచ కార్మిక పోరాట దినాన్ని జయప్రదం చేయండి
కార్మిక సంఘ వాల్ పోస్టర్ లు ఆవిస్కరించిన కార్మిక సంఘం నాయకులు
పరకాల నేటిధాత్రి
ఎఐటీయూసి హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్,జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున పరకాల పట్టణంలో ప్రపంచ కార్మిక పోరాటదినం వాల్ పోస్టర్ లను విడుదల చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మేడే రోజు పెద్ద ఎత్తున ర్యాలీ మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున కార్మికులు,కర్షకులు,బజార్ అమాలీలు,మున్సిపాలిటీ కార్మికులు,గ్రామపంచాయతీ కార్మికులు,ఆశ వర్కర్లు, అంగన్వాడీలు,మధ్యాహ్నం భోజన కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు,అన్ని రంగాల కార్మిక వర్గాలు అందరూ హాజరై 139వ మేడే ను పెద్ద పండగను తలపించే విధంగా జరుపుకోవాలని అన్నారు.ఏఐటీయూసీ కార్మికుల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ తమ హక్కుల కోసం తమకు కేంద్ర ప్రభుత్వం ఏవైతే నాలుగు కోడ్లుగా తీసుకువచ్చి మరి కార్మికులకు మళ్లీ తుంగలో తొక్కాలని చూస్తున్నదని కేంద్ర ప్రభుత్వానికి మే 20న దేశ వ్యాప్త సమ్మెకు దిగి మేడే ను జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోకిల శంకర్,శ్రీపతి కుమారస్వామి, రేణిగుంట్ల రాజయ్య,బొట్ల భద్రయ్య,కోట యాదగిరి,మోరే రవి,కొయ్యడ భద్రయ్య,శ్రీపతి శ్రీనివాస్,ఓ.శంకర్,రేణిగుంట్ల వెంకటేష్,ఎం.జగన్,బొట్ల రాజు,పాపయ్య లు పాల్గొన్నారు.