బి.ఆర్.ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 37వ వార్డులో మాజీ కౌన్సిలర్ రెడ్డి మాధవి రాజు ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలో డప్పు సప్పులతో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వాన పత్రికను అందించి కుటుంబ సమేతంగా తేది:27-4-24 ఆదివారం రోజున జరగబోయే భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వేడుకల సందర్భంగా రజతోత్సవ సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగినది. అంతే కాకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటలు విని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినాయంగా వార్డు ప్రజలను కోరుతూ ఆహ్వాన పత్రిక అందించడం జరిగినది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాజా మాజీ చేనేత, జౌలి మరియు టెక్స్ టైల్స్ కార్పొరేషన్ అధ్యక్షులు గూడూర్ ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ రమేష్, 37.వ వార్డు బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి,కూరపాటి భూమేష్, బూత్ అధ్యక్షులు వేముల తిరుపతి, మహిళా విభాగం వార్డు అధ్యక్షులు ముదారపు లలిత రాజేశం, కమిటీ సభ్యులు, ఎక్కల దేవి శ్యామల, గంగుల సదానందం, మచ్చ సురేష్, గాజుల ఎల్లయ్య, జిందం రాజేశం, బోద్దుల రమేష్, పచ్చనూరు తిరుపతి, గజ్జల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.