అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందాలి.

Collector

అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందాలి

లబ్ధిదారులకు ఇసుక ఉచితం.. రవాణా ఛార్జీలు చెల్లించాలి
పైలట్ ప్రాజెక్ట్ గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం పూర్తి చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్ గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మండలాలు, మున్సిపాలిటీల వారిగా ఇండ్ల నిర్మాణాల పురోగతి పై ఆరా తీశారు. ఎందుకు లక్ష్యం చేరుకోలేదో వివరాలు అడిగి తెలుసుకొని, త్వరగా ఎలా పూర్తి చేయాలో సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రామ, కమిటీలు గుర్తించిన వారితో పాటుగా ఎవరైనా నిరుపేదలు ఉంటే పూర్తి వివరాలు తీసుకొని ఇండ్లు ఇవ్వాలని సూచించారు. గ్రామాలు, వార్డుల్లో గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన గృహాలను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చేర్చవద్దని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

Collector
Collector

 

 

 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని తెలిపారు. రవాణా ఛార్జీలు మాత్రమే లబ్దిదారు చెల్లించాలని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక అయిన గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు సమన్వయంతో పని చేసి ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని తెలిపారు.
గ్రామాలు, మున్సిపాలిటీలలో అధికారులు నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటించి, అర్హులకు ఇండ్ల నిర్మాణాలపై సూచనలు అందించాలని, పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, సర్వే వివరాలు ప్రతి రోజూ సాయంత్రం తమకు పంపించాలని కలెక్టర్ సూచించారు.వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, పీడీ హౌసింగ్ శంకర్, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!