కోడవటంచ లో కిన్నెరసాని వాగుపై హై లెవల్ వంతెన నిర్మించాలని కలెక్టర్ కు వినతి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గురువారం గుండాల మండల భూభారతి అవగాహన సదస్సుకు వచ్చిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు కొడవటంచ గ్రామ ప్రజలు కిన్నెరసాని లో లెవెల్ వంతెన పై ఐలెవల్ వంతెన నిర్మించాలని, కొడవటంచ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఏడు మొలకల వాగుపై ఇసుక మేటలు తొలగించాలని, కొడవటంచ గ్రామంలో అంతర్గత రోడ్లకు సిసి రోడ్లు శాంక్షన్ చేయాలని వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు, పర్షిక రవి, మాట్లాడుతూ కోడవటంచ ,నాగారం ,పాలగూడెం ప్రజలకు వర్షాకాలం వస్తుందంటే కునుకు నిద్ర లేకుండా పోతుందని ఎప్పుడూ కిన్నెరసాని వాగు వస్తుందో అని భయంతో కునుకు తీస్తున్నారని ఈ బాధలను జిల్లా కలెక్టర్ అర్థం చేసుకుని కొడవటంచ కిన్నెరసాని ఏడు మేలకాల వాగుపై హై లెవల్ వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.
అట్లాగే కొడవటంచ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఏడు మేలుకల చెక్ డ్యామ్ పై వేసిన ఇసుకమేటలను తొలగించి కొడవటంచ, నాగారం ,పాలగూడెం గ్రామ ప్రజలకు సాగునీరు అందించాలని, డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పర్శక రవి, ఈసం మల్లయ్య, వజ్జమంగయ్య తదితరులు పాల్గొన్నారు.