పంట వేసిన అందని రైతు బందు
అధికారుల నిర్లక్ష్యమే కారణం
ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి
రైతు బంధు పథకం రైతుల సహాయార్థం కోసం గత ప్రభుత్వం చేపట్టిన ఒక అద్భుతమైన పథకం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం
తాము పంట వేసిన
సంబంధిత మండల వ్యవసాయాదికారులు సర్వే సరిగా చేయక పోవడం మూలంగా మాకు రైతు బందు పథకం కింద పెట్టుబడి సహాయం అందలేదని ఎల్లారెడ్డిపేట లో ఒక మహిళ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళ్తే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన లింగాల బాలమణి అనే మహిళా రైతు కు ఎల్లారెడ్డిపేట లో ఒక ఎకరం 30 గుంటల వ్యవసాయ భూమి కలదు. ఆ వ్యవసాయ భూమి లో వరి పంట వేశారు.వరి పంట వేసిన కానీ రైతు బందు సహాయం పడలేదని మండల వ్యవసాయాధీకారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆరోపించారు. పంట వేయని రైతులకు కొంతమంది కి రైతు బందు సహాయం అందిస్తున్నారని తమకు రైతు బందు సహాయం కింద పెట్టుబడి సహాయం అందకుండా చేసిన మండల వ్యవసాయాదికారుల పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె కోరారు.