పోషణ పక్షం..ఆరోగ్య లక్ష్యం
ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం రామారావు పేట గ్రామంలో పోషణ పక్షం కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్.కవిత మాట్లాడుతూ ఒక శిశువు యొక్క జీవితంలో మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి అలాగే గర్భిణీ,బాలింతలు తీసుకోవలసిన పౌష్టికాహారం గురించి,తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు.0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు పెరుగుదల పర్యవేక్షణ ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది.అలాగే పిల్లలు ఎత్తుకు తగిన బరువు వయసుకు తగిన బరువు ఉండేలా మంచి పౌష్టికాహారం పెట్టాలని తాజా పండ్లు, కూరగాయలు,పాలు ఆకుకూరలు,చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలు పెట్టాలని బయట జంక్ ఫుడ్ పెట్టకూడదని చెప్పారు.లోప పోషణ గల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రజిత, అంగన్వాడీ టీచర్లు విజయ,అంజమ్మ జ్యోతి,సరిత,ఆయాలు మహిళా సంఘాల సిఏ లు, వివో లు,పిల్లల తల్లిదండ్రులు ఇతరులు పాల్గొనడం జరిగింది.