శ్రీ చైతన్య విద్యార్థిని అభినందించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్
ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని దుంపేటి లాస్య ఇటీవల జరిగిన జాతీయ స్థాయి ఇండియన్ నేషనల్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాఠశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి అధ్యక్షతన అభినందించి బహుమతిని(ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్) అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి దుంపేటి లాస్య నీ
శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్,డైరెక్టర్ శ్రీ విద్య, ఎ.జి.యం అన్నపూర్ణ అకాడమిక్ కోఆర్డినేటర్ రాంబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ విజయ్ కుమార్,రవీందర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.