*ఎమ్మెల్యేకు పలువురి వినతి..
పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 16:
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు బుధవారం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి విన్నవించారు. తొలుత పలమనేరు ఫుట్ వేర్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పట్టణం నందు మొత్తం 42 దుకాణాలు ఉన్నాయని అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారుల వల్ల తమ తీవ్రంగా నష్టపోతున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఫుట్ పాతులపై విక్రయాలు జరుగుతుండడంతో తామ తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఇప్పటికే ఆన్లైన్ బిజినెస్ ద్వారా తమ వ్యాపారాలు 50 శాతానికి పడిపోయాయని ఇతర ప్రాంతాల వారితో పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి పట్టణానికి దూరంగా వారు వ్యాపారాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కార్పొరేషన్ రుణాలను అందించి తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జగా, జాకీర్ రాఘవేంద్ర, కాలేషా తదితరులున్నారు.
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి…
వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చొరవ చూపాలని వీఆర్ఏల సంఘం నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏల పై నిబంధనలకు విరుద్ధంగా మోపిన నైట్ డ్యూటీలు, ఇసుక,రైస్ మిల్లుల వద్ద డ్యూటీలు వెంటనే నిలిపివేయాలని కోరారు. తెలంగాణలో ఇస్తున్నట్లు వీఆర్ఏలు అందరికీ పేస్ కేల్ జీతాలు చెల్లించాలని, డీఏను జీవితంలో కలపాలన్నారు. గతంలో వైసిపి పాలనలో రికవరీ చేసిన డి ఏ నగదును తిరిగి చెల్లించాలని ఇంటర్మీడియట్ విద్యా అర్హతల ఆధారంగా ప్రమోషన్లు అమలు చేయాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీఆర్ఏల సంఘ నాయకులుతో పాటు, కార్మిక సంఘ నాయకులు ఓబుల్ రాజు పాల్గొన్నారు.