తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ‘‘కేసిఆర్’’
వరంగల్ రజతోత్సవ సభ ఎలా వుంటుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ కు వివరించిన ఎమ్మెల్సీ ‘‘పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి’’ వివరాలు…ఆయన మాటల్లోనే..
`తెలంగాణను తెర్లు చేస్తున్న కాంగ్రెస్ గుండెలు అదిరిపోవాలే..
`రజతోత్సవ సభ తరతరాల తెలంగాణ చరిత్రకు గుర్తుగా నిలుస్తుంది
`తెలంగాణ నలు మూలల నుంచి దండు కదిలితే ఎలా వుంటుందో అలా వుంటుంది
`పుట్టల్లో నుంచి చీమలు వచ్చినట్లు ప్రజలు వరంగల్ సభకు వస్తారు
`వరంగల్ రజతోత్సవ సభను చూసి కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అవుతుంది
`సభలంటే బిఆర్‌ఎస్ సభలే అని ప్రపంచమంతా మాట్లాడుకునేలా వుంటుంది
`చరిత్రలో రజతోత్సవ సభ సువర్ణాక్షరాలతో లిఖించేలా జరుగుతుంది
`బిఆర్‌ఎస్ అంటే నాయకులే కాదు యోధులు
`త్యాగాల వీరులు..తెలంగాణ తెచ్చిన ధీరులు
`తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వాప్నికులు
`తెలంగాణ అంటేనే పడని వాళ్లు పాలకులైతే ఇలాగే వుంటుంది
`తెలంగాణ మీద ప్రేమ లేని వాళ్ల చేతిలో పెడితే విధ్వంసమౌతుంది
`60 ఏళ్ల కలను నిజం చేసింది కేసిఆర్
`14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చింది కేసిఆర్
`పదేళ్లలో తెలంగాణను వందేళ్లు ముందుకు తీసుకెళ్లింది కేసిఆర్
`ఒక్క ఏడాదిలోనే మళ్ళీ వందేళ్లు వెనక్కి నెట్టింది కాంగ్రెస్
`కాంగ్రెస్ అంటేనే కరువు…తెలంగాణకు బరువు
`కాంగ్రెస్ అంటేనే కష్టం.. నష్టం
`యాభై ఏళ్లు పాలించి 50 వేల ఎకరాలు పారించలేదు
`పదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరిచ్చింది కేసిఆర్
`మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
`అలవికాని హామీలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది
`పాలించడమంటే నోటి కొచ్చింది చెప్పడం కాదు
`ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం
`అవి రెండూ కాంగ్రెస్ కు చేతకాదు
`భవిష్యత్తులో మరో పాతికేళ్లు ప్రజలు ఇక కాంగ్రెస్ ను జనం నమ్మరు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏనుగు వెళ్తుంటే మొరిగే శనకాలు వుంటాయి. అవి శునకానందం పొందుతుంటాయి. అల్పులు, అజ్ఞానులు అంతటా వుంటారు. తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వాళ్లు ఏవేవో మాట్లాడుతుంటారు. కాని తెలంగాణ ఆత్మతో పెనవేసుకున్న బిఆర్‌ఎస్‌ను విమర్శిస్తేనే రాజకీయ మనుగడ అనుకునే వారు కూడా చాల మంది వుంటారు. అలాంటి వారికి బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ మరోసారి పాఠమే కాదు, గుణపాఠం కూడా నేర్పుతుంది. సభలంటే అవి తెలంగాణకే పరిమితం. తెలంగాణ ఉద్యమానికే తలనమానికం. బిఆర్‌ఎస్ పార్టీకే సొంతం. ఆ చరిత్రను తిరగరాసే శక్తులు లేవు. రావు. మళ్లీ మళ్లీ సింహగర్జన లాంటి సభలు నిర్వహించాలన్నా, ఆ చరిత్రను తిరగరాయాలన్నా అది బిఆర్‌ఎస్‌కే సాధ్యం. కేసిఆర్ పేరు చెబితే తప్ప అంత గొప్పసభలు జరగవు. అందుకే ఈసారి బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ నభూతో నభిష్యతి అని ప్రపంచమంతా మాట్లాడుకునేలా జరుగుతుందని ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజాసభలకు కూడా అనుమతులు ఇవ్వని చరిత్ర కాంగ్రెస్‌ది. కాంగ్రెస్‌కు ఈ నికృష్ట సంప్రదాయంకొత్తది కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే సభ నిర్వహణకు ప్రతిసారి కోర్టును ఆశ్రయించి తెచ్చుకోవాల్సి వచ్చేది. తెలంగాణ వ్యతిరేకులు పాలిస్తున్న ఈ సమయంలో కూడా బిఆర్‌ఎస్ సభకు మళ్లీ అనుమతి కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. ఇది కాంగ్రెస్ నైజం. ఆ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులులేరు. తెలంగాణ కోసం గొంతిత్తిన వాళ్లు లేరు. వున్న వారు పదవుల కోసం ఆరాటం తప్ప, తెలంగాణ కోసం నొరెత్తే శక్తి లేని వాళ్లు వున్నారు. అందుకే కాంగ్రెస్‌ను నమ్మి, తెలంగాణ మళ్లీ ఒకసారి ఆగమైంది. ఒక్క అవకాశమంటూ ప్రజలను వేడుకొని, అడుగడుగునా ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాటి అమలు చేయలేక, కనీసం కేసిఆర్ వేసిన బాటలో నడవలేక తెలంగాణను తెర్లు చేస్తున్నారు. బంగారు తెలంగాణను ఆగం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నునంచే ప్రజలకు ఆ ప్రభుత్వం ఏమిటో తెలిసిపోయింది. వారి పాలన చేతగాదని తేలిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు కాంగ్రెస్ పాలనలో అమలు కావని అర్ధమైపోయింది. అందుకే ఇంత తొందరగా ప్రజా వ్యతిరేక మూటగట్టుకున్న ప్రభుత్వం ప్రపంచంలోనే కూడా ఎక్కడా వుండదు. అందుకే ప్రజలు ఎప్పుడెప్పుడు మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వమొస్తుందా? కేసిఆర్ మళ్లీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా? పచ్చని తెలంగాణను ఎండబెట్టిన కాంగ్రెస్ దరిద్రం పోతుందా? అని చూస్తున్నారు. బిఆర్‌ఎస్ రజతోత్సవ సభతో ప్రజలకు భరోసా కల్పించడానికి, భవిష్యత్తు బంగారంగా వుంటుందని చెప్పడానికి వరంగల్ సభ గొప్పగా జరగనుంది. తెలంగాణ నలు మూలల నుంచి పది నుంచి పదిహేను లక్షల మంది ప్రజల హజరయ్యే అవకాశం వుంది. అందుకే 1200 ఎకరాలలో చరిత్రలో నిలిచిపోయే మరో గొప్ప సభకు శ్రీకారం చుడుతున్నాం..ఈ రజతోత్సవేడుక సాక్షిగా మరో వందేళ్ల చరిత్రకు, ప్రయాణానికి పునరంకితం కావాలనుకుంటున్నామంటున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి తన అభిప్రాయాలను నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…
కేసిఆర్ అంటేనే ఒక చరిత్ర. కేసిఆర్ అంటేనే యుగకర్త. కేసిఆర్ అంటేనే తెలంగాణ జీవనాడి. తెలంగాణ ఉద్యమ వేడి. తెలంగాణ కారణజన్ముడు. తెలంగాణ ప్రజల గోస తీర్చేందుకు కదం తొక్కిన వీరుడు. అందుకే తెలంగాణ తెలంగాణ వచ్చింది. అందుకే తెలంగాణ జాతి పిత కేసిఆర్ అని ప్రజలు కొనియాడుతున్నారు. ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. ఒక రాజకీయ పార్టీకి 25 వసంతాల ప్రయాణం సామాన్యమైనవిషయం కాదు. తెలంగాణ పేరు మీద అనేక పార్టీలు ఏర్పాటయ్యాయి. అవకాశ వాద రాజకీయాలు చేయాలనుకున్న వారు మధ్యలోనే తెలంగాణ మంత్రం మర్చిపోయారు. తెలంగాణ కోసం జై తెలంగాణ అనడమే మానేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక యజ్ఞంగా కొనసాగించి, కడదాకా కొట్లాడి సాధించిన నాయకుడు కేసిఆర్. దేశంలో ఉద్యమ పార్టీలు చాలా తక్కువ. అందులోనూ బిఆర్‌ఎస్ లాంటి పార్టీ మరొకొటి లేదు. రాదు! ఇంకా వందేళ్లయినా చెక్కు చెదరని పార్టీ బిఆర్‌ఎస్. ఇంకా వెయ్యేళ్లైనా తెలంగాణ సమాజం మర్చిపోని ఏకైక నాయకుడు కేసిఆర్. అలాంటి నాయకులు లేరు. భవిష్యత్తు చూడదు. తెలంగాణ తేవడమే కాదు..తెచ్చిన తెలంగాణను పదేళ్లలో బంగారు తెలంగాణ చేసిన పాలకుడు కేసిఆర్. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి, రైతులుకు నీటి కష్టాలు తీర్చిన భగీరధుడు. కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్లుగా పునాది రాయితప్ప, తట్టెడు మట్టి తీయని ప్రాజెక్టులు అనేకం వున్నాయి. దశాబ్దాలుగా వాటి పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికిప్పుడు పబ్బం గడుకున్నదే తప్ప చుక్క నీరివ్వలేదు. ఎకరం పొలం పారించలేదు. తెలంగాణ ఎడారిగా మారుతున్నా గుడ్లప్పంచి చూశారు. తెలంగాణ ప్రజలు కన్నీరు కారుస్తుంటే, కాంగ్రెస్ నాయకులు చూసి నవ్వుకున్నారు. ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కార్చారు. ఉమ్మడి పాలకులను ఎదిరించే ధైర్యం లేక చేష్టలుడిగి చూశారు. ఉమ్మడి పాలకుల మోచేతినీళ్లు తాగడం అలవాటు చేసుకున్నారు. అందుకే తెలంగాణ గురించి ఏనాడు పట్టించుకోలేదు. కేసిఆర్ పేరు తెలంగాణలో నిత్య స్మరణ కావడానికి, ప్రజల గుండెల్లో కేసిఆర్ నిలిచిపోవడానికి, తెలంగాణ సాధనతోపాటు, కాళేశ్వరం, యాదాద్రి దేవాలయాలు చాలు. ఇప్పటి కాలంలో ఎవరికీ సాద్యం కాని యాదాద్రి గుడి నిర్మాణం జరిగింది. అలాంటి గుడి నిర్మాణం జరగాలంటే కనీసం 25 సంవత్సరాలు పడుతుంది. కాని ఏడేళ్ల కాలంలో యాదాద్రి గుడి నిర్మాణం జరగడంత ప్రపంచమంతా విస్తుపోయింది. కాళేశ్వరంతో మొదలైన పోలవరం ఎక్కడున్నదో..కాళేశ్వరం పూర్తయి నీళ్లు ఎలా ఇస్తున్నదో ప్రజలు చూస్తూనే వున్నారు. కేసిఆర్ నాయకత్వ పటిమను కొనియాడుతూనేవున్నారు. ఇరవైదేళ్ల పాటు ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినా తలా తోకలేని కొంత మంది నాయకులు వేస్తున్న ప్రశ్నలు విచిత్రంగా వున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల పసలేని వాదన అద్వాహ్నంగావుంది. మాటకు ముందు కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మాట్లాడే నాయకులు ఆ పార్టీ చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని బారతీయుడు పెట్టింది కాదు. ఏవో హ్యూమ్‌అనే ఆంగ్లేయుడు పెట్టిన పార్టీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు చీలికలు, పీలికలైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్టీ చీలిన ప్రతీసారి కొత్త గుర్తుతో ప్రజల ముందుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలా పలుసార్లు అంతరించి, మిగుతూవచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడున్నది అసలైన కాంగ్రెస్ కాదు. స్వాతంత్య్ర ఉద్యమానికి ఇప్పుడున్న కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. కాని టిఆర్‌ఎస్ నుంచి బిఆర్‌ఎస్ పేరు పార్టీయే పేరు మార్చుకున్నది. టిఆర్‌ఎస్ నాయకుడైనా, బిఆర్‌ఎస్ నాయకుడైనా ఒక్కరే..ఆ ఒక్కరు కేసిఆరే…పార్టీ పేరు మాకు మేముగా మార్చుకున్నాం..పార్టీ జెండా మారలేదు. గుర్తు మారలేదు. ఎన్నికల సంఘం ఒప్పుకున్నది. ఎన్నికల సంఘం నియమాళికి లోబడి పేరు మార్పు జరిగింంది. పార్టీ పేరు మార్పును అంగీకరించింది. ఈ మాత్రం అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు లేనిపోని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు. వారి మాటలు అసలే నమ్మరు. బిఆర్‌ఎస్ రజతోత్సవ సభను చూసి కాంగ్రెస్ పార్టీ గుండెలు అదిరిపోతుంది. ఆ పార్టీ అతలా కుతలమౌతుంది. రాజకీయసభలంటే బిఆర్‌ఎస్ సభల్లా వుండాలని ప్రపంచమంతా 27 తర్వాత మాట్లాడుకంఉటుంది. చరిత్రలో వరంగల్ సభ మరోసారి సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ అంటే కేవలం రాజకీయ సభ కాదు. అది ప్రజల సభ. తెలంగాణ వాదుల సభ. తెలంగాణ ఉద్యమకారుల సభ. త్యాగాల వీరులైన బిఆర్‌ఎస్ అభిమానులసభ. తెలంగాణ తెచ్చిన ధీరుల సభ. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వాప్నికుల సభ. తెలంగాణ తలరాత మార్చిన బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభ. తెలంగాణ కోసం జీవితమే త్యాగం చేసిన పోరాట యోధుడు కేసిఆర్ సభ.