విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని జమస్థాపురం, రూప తండా లో జరిగింది. రైతు భూక్య రవి గురువారం తన పొలం వద్ద ఎద్దులను మేత మేపుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు ఒక ఎద్దు వెళ్లగానే షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. వ్యవసాయ పనులకు ప్రధాన ఆధారమైన ఎద్దు మృతి తో కుటుంబం ఆర్ధికంగా నష్టపోయింది.. వారు కన్నేరుమున్నీరు గా విలపించారు. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఎద్దులు మృతి చెందాయని బాధిత రైతులు ఆరోపించారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేషి కుటుంబాన్ని ఆదుకోవాలని తొర్రూరు ప్యాక్స్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ రావు అధికారులకు విజ్ఞప్తి చేశారు.