బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలి
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు
తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి
ఈనెల 27న ఎల్కతుర్తి
వరంగల్ జిల్లాలో జరుగు బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలని తొర్రూరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతానములు గారు పిలుపునిచ్చారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం నేడు కొమ్మనపల్లి, చింతలపల్లి టీక్య తండా, పెద్దమంగ్య తండా, వెలికట్టే, భోజ్య తండా ఈదులకుంట తండా నాంచారి మడూర్ ,గుడి బండ తండా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశా నిర్దేశం చేశారు కార్యక్రమంలో మాజీ తొర్రూరు మండలం ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య మాజీ జెడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ మాజీ కో ఆప్షన్ ఎస్కే అంకుష్ ,కాలు నాయక్, ఈనపెళ్లి శ్రీనివాస్ ,పాపిరెడ్డి , పులి వెంకన్న ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఉపసర్పంచ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు రజితోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.