వరంగల్ సభను విజయవంతం చేద్దాం…
– వరంగల్ సభ పోస్టర్ ఆవిష్కరించిన…
– నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి….
కొల్చారం,( మెదక్) నేటిధాత్రి :-
ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ జిల్లా ఎలకతుర్ధిలో జరగనున్న బి ఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ తాజా మాజీ ఎంపీపీ మంజుల నాయకులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 వ సంవత్సరంలో గులాబీ పార్టీ జెండా పట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వరంగల్ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు బయలుదేరాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ తరపున వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగాయిపేట రైతు సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, తుంకులపల్లి సంతోష్ రావు , మోత్కు మల్లేశం, వేమారెడ్డి, పరిగి రమేష్ కుమార్ , బిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.