తల్లిదండ్రుల దాతృత్వం…
అంగన్ వాడీ కేంద్రానికి రూ.5 వేల విలువైన
కూలర్ అందజేత…
గర్భిణీ స్త్రీలు,పిల్లలకు రక్తహీనత గురించి అవగాహన..
కేసముద్రం/ నేటి ధాత్రి
వేసవి కాలం నేపథ్యంలో చిన్నారుల సౌకర్యార్థం కేసముద్రం మున్సిపల్ కేంద్రం, పాత బజారు లోని అంగన్ వాడీ కేంద్రానికి చెందిన పలువురు చిన్నారుల తల్లిదండ్రులు రూ.5 వేల విలువైన కూలర్ ను విరాళంగా అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా పోషణ్ పక్వాడ్ వారోత్సవాల్లో భాగంగా గురువారం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు,బాలింతలు, చిన్నారులకు రక్తహీనత, హ్యాండ్ వాష్ ,పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ కేంద్రానికి కూలర్ బహుకరించిన చిన్నారుల తల్లిదండ్రులకు అంగన్వాడీ టీచర్ ఈ.రాజమణి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ, అంగన్ వాడీ టీచర్ ఈ. రాజమణి, నాగనబోయిన సునితావెంకటేశ్వర్లు, ముత్యాల నాగమణి, ముల్క చంద్రకళ,వెలుగు సీఏ దొడ్డ అనసూర్య, వద్ది సౌమ్య, వద్ది ఉదయ, మహమ్మద్ నగ్మా, మహ్మద్ జహీరా,బి.శిరీష, ఆశా సుజాత, ఆయా అరుణ తదితరులు పాల్గొన్నారు.