వాలయ పునర్నిర్మాణానికి
2 లక్షల 16 వేలువిరాళం.
చిట్యాల,నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి ఏలేటి రామయ్య పల్లి గ్రామ వాస్తవ్యులు కీర్తి శేషులు ఏలేటి నర్సయ్య, లింగమ్మ, ముత్తమ్మ గార్ల జ్ఞాపకార్థం కొత్తూరు వెంకటమ్మ – స్వామీరెడ్డి మరియు కొత్తూరు మల్లారెడ్డి – హేమ, కొత్తూరు నర్సింహా రెడ్డి(డాక్టర్) – శిరీష , కొత్తూరు విజందర్ రెడ్డి – సుష్మ దంపతులు కలిసి శివాలయానికి విరాళంగా 216000/- రూపాయలు అక్షరాల (రెండు లక్షల పదహారు వేల రూపాయలు) ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమం లో శివాలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్,బిళ్ళ సత్యనారాయణ రెడ్డి, మందల రాఘవరెడ్డి,కాల్వ సమ్మిరెడ్డి,బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, మోతుకూరి రాజు,చెక్క నర్సయ్య,సర్వ శరత్, తీగల నాగరాజు,అనగాని రాజయ్య,తిప్పణవేణి రవి, ప్రధాన అర్చకులు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.