ఎస్టిపిపి లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతం.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ ఎస్టిపిపి టౌన్షిప్లో కరాటే శిక్షణా కేంద్రం 2021లో దారవత్ పంతుల విజన్‌తో, డైరెక్టర్ మరియు జీఎం (ఎస్టిపిపి)ఆమోదంతో స్థాపించబడింది.ఈ శిక్షణా కేంద్రం ద్వారా ఎస్ సి సి ఎల్, పవర్ మెక్ మరియు సి ఆర్ పి ఎఫ్ ఉద్యోగుల పిల్లలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కరాటే శిక్షణ పొందుతున్నారు. శారీరక దృఢతతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది.
ఈ శిక్షణా కేంద్రం అభివృద్ధికి ప్రతిఫలంగా,2025 ఏప్రిల్ 6వ తేదీ,ఆదివారం జైపూర్ ఎస్టిపిపి ఓపెన్ ఆడిటోరియంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్టిపిపి పవర్ ప్లాంట్ సింగరేణి జనరల్ మేనేజర్ కొండారెడ్డి శ్రీనివాసులు హాజరై టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బెల్ట్‌లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌కి ఎంపికైన విద్యార్థిని జనని ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ ఘనత ఎస్టిపిపి కరాటే శిక్షణా కేంద్రానికి గర్వకారణంగా నిలిచింది.కరాటే కోచ్ శివ మహేష్ మాట్లాడుతూ… దారవత్ పంతుల ప్రోత్సాహం వల్లే ఈ కార్యక్రమం ఇవాళ ఈ స్థాయికి ఎదిగింది అని అన్నారు.జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీజీఎంలు దారవత్ పంతుల, రాజేష్, జెంట్స్టోరియో స్టైల్ చీఫ్ కోచ్ రాజనర్స్,జూల శ్రీనివాస్ మరియు కోచ్ శివ మహేష్ పాల్గొన్నారు.